calender_icon.png 15 October, 2024 | 10:52 AM

ఇజ్రాయిల్‌పై హెజ్‌బొల్లా డ్రోన్ల దాడి

15-10-2024 02:15:58 AM

నలుగురు సైనికులు మృతి

70 మందికి గాయాలు

బీరూట్, అక్టోబర్ 14: తమ అగ్రనేతలను చంపినందుకు ప్రతిగా డ్రోన్ల సహాయంతో లెబనాన్‌కు చెందిన ఉగ్ర సంస్థ  హెజ్‌బొల్లా  ఇజ్రాయిల్‌పై దాడి చేసింది. ఇజ్రాయిల్‌లోని బిన్యమినా ప్రాంతంలో ఉన్న ఐడీఎఫ్‌కు చెందిన గోలాన్ బ్రిగేడ్‌కు చెందిన ట్రైనింగ్ సెంటర్‌పై హెజ్‌బొల్లా భారీ సంఖ్యలో డ్రోన్లతో విరుచుకుపడింది.

ఈ దాడిలో నలుగురు సైనికులు చనిపోగా, దాదాపు 70 మంది గాయపడినట్లు వార్తలు వచ్చాయి.   దాడిలో అక్కడే ఉన్న ఐడీఎఫ్ చీఫ్ లెఫ్టినెం ట్ జనరల్ హెర్జిమలెవీ చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో నిజం లేదని జెరూసలెం పోస్ట్ వెల్లడించింది. డ్రోన్లు అన్నీ ఒకేసారి దాడి చేయడంతో ఇజ్రాయిల్ ఐరన్ డోమ్‌తోపాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేయకుండా పోయా యి.

డిఫెన్స్ వ్యవస్థలను తప్పించుకొని డ్రోన్ల దాడి ఎలా జరిగిందో విచారణ చేస్తా మని ఐడీఎఫ్ ప్రతినిధి హగారీ తెలిపారు. కాగా హెజ్‌బొల్లాతో జరుగుతున్న యుద్ధం లో తమదే పైచేయిగా ఉందని ఆయన చెప్పారు. హెజ్‌బొల్లా డ్రోన్లను మిర్సాద్ రకం డ్రోన్లుగా గుర్తించారు. వీటి సాయంతో 120 కి.మీ. దూరంలోని లక్ష్యాలపై గంటకు వేగంగా దాడిచేయవచ్చు.