calender_icon.png 19 November, 2024 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొల్లమాంబ విగ్రహ దిమ్మెను కూల్చడం హేయ మైనా చర్య

09-11-2024 05:12:45 PM

మొల్లమాంబ విగ్రహ దిమ్మెను పునః ప్రతిష్ఠించాలి

అణ గారిన కుమ్మరులకు అవమానం

మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి

కోదాడ (విజయక్రాంతి): మొల్ల మాంబ విగ్రహ దిమ్మెను కూల్చడం హేయమైన చర్య అని కుమ్మరి సంఘం నాయకులు మామిడి రామారావు, చలిగంటి రామారావులు అన్నారు. శనివారం పట్టణంలోని పబ్లిక్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కుమ్మర్లను ఆర్థికంగా, రాజకీయంగా, వృత్తిపరంగా అనేక విధాలుగా వేలుగులోకి రాకుండా చూస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ప్రస్తుతం వృత్తి కనబడకుండా పోయింది. వారి ఉనికి కోసం ఆయా గ్రామాలలో పట్టణాలలో మొల్లమాంబ విగ్రహాలు ఏర్పాటు చేసుకుందామని అనుకున్న వాటి దిమ్మలను కూడా తొలగించేసి తొక్కి పారేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియ మండల కేంద్రంలో తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్లమాంబ విగ్రహ ఏర్పటు చేయుటకు  నిర్మించిన దిమ్మెను మున్సిపల్ అధికారులు కుల్చివేయడం హేయ మైనా చార్య ఒక వైపు బీసీ కులగణన పేరుతో ప్రభుత్వం బీసీల మీద ప్రేమ చూపిస్తూ నటిస్తూ మరో వర్గం బీసీ లను అనగ దొక్కే విదంగా ఇలా చేయటం సరియైనది కాదు అని దిమ్మే కుల్చే విషయంలో పాల్గొన్న అధికారులను వెంటనే సస్పెండ్ చేస్తు చర్యలు తీసుకోవాలని లేకపోతే ఈ ప్రభుత్వం బీసీల వ్యతిరేకిగా ముద్ర వేయించుకుంటుందని తెలిపారు. కుమ్మర్లను తొక్కాలని చూస్తే సంఘటితమై వ్యతిరేక పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామారావు, చలిగంటి ప్రసాద్, చలిగంటి దామోదర్, చలిగంటి వెంకట్ నరసయ్య, గుడిమెట్ల రామకృష్ణ, సలిగంటి నాగరాజు, కొలుచలం నరేష్, చలిగంటి రంగా, పొనుగోటీ శివ, అఖిల్ పలువురు కుమ్మరులు పాల్గొన్నారు.