నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న మరో చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. సుధీర్ వర్మ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కన్నడ భామ రుక్మిణి వసంత్ కథానాయిక. మరో బ్యూటీ దివ్యాంశ కౌశిక్ కీలక పాత్రలో నటించగా, హర్ష చెముడు ముఖ్య పాత్రను పోషించారు.
తాజాగా ఈ సినిమా నుంచి ఓ మెలోడీ సాంగ్‌ను మూవీ యూని ట్ విడుదల చేసింది. కార్తీక్ స్వరపరిచిన బాణీకి కృష్ణ చైతన్య సాహిత్యాన్ని అందించారు. ‘హే తారని తెలుసుకున్నా.. తారని కలుసుకున్నా..’ అంటూ సాగే ఈ పాట ను కార్తీక్, నిత్యశ్రీ ఆలపించారు. దీపావళి సందర్భంగా నవంబర్ 8న విడుదల కానున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్; ఎడిటర్: నవీన్ నూలి.