calender_icon.png 16 November, 2024 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హే జుమ్కా!

16-11-2024 12:00:00 AM

హియర్ రింగ్స్.. చెవి పోగులు.. జుమ్కా.. ఎన్ని భాషల్లో వీటి గురించి మాట్లాడుకున్న తక్కువే మగువలకు.. చార్మినార్.. చోర్ బజార్.. మదీనా.. ఇలా ఎక్కడికి వెళ్లినా.. ప్రత్యేకంగా అమ్మాయిలను ఆకర్షించేవి తళతళలా మెరిసే హియర్ రింగ్స్ మాత్రమే. ఎన్ని రకాల జ్యువెలరీలున్నా హియర్ రింగ్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. రింగులు, దిద్దులు, బుట్టలు వంటి అనేక రకాలు మార్కెట్లో ఉన్నాయి.

అయితే ట్రెండింగ్‌లో ఎన్ని ఉన్నా జుమ్కీ స్టయిల్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు యువత. సందర్భం ఏదైనా.. పంజాబీ, చుడీదార్, పట్టు చీరలు లేదా లెహంగాలు ఇలా వేటి మీదకైనా డిఫరెంట్ జుమ్కీ స్టయిల్ హియర్ రింగ్స్‌ను పెట్టుకుంటున్నారు. జుమ్కీ స్టయిల్‌లోని కొన్ని రకాల గురించి తెలుసుకుందాం.. 

* జుమ్కీలు సాంప్రదాయ భారతీయ రూపానికి అద్దం. జుమ్కీలు రకరకాల ఆకారాలు, సైజులలో ఉంటున్నాయి. క్లాసిక్ సిల్వర్ ఆక్సిడైజ్డ్ హియర్ రింగ్స్ లేదా సాంప్రదాయ బంగారంతో తయారు చేసినవే కాదు ఆధునిక మెటాలిక్ ఫినిష్డ్ జుమ్కీలను యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దుస్తులకు అనుగుణంగా జుమ్కీ స్టయిల్స్‌ను వచ్చాయి. ఆన్‌లైన్‌లో ఇటువంటి రకాల డిజైన్లు చాలా అందుబాటులో ఉన్నాయి. ఈ రకమైన హియర్ రింగ్స్ టీనేజ్ అమ్మాయిలకు బాగా అబ్బుతాయి. 

* వైట్ కలర్, స్టోన్ వర్క్ ఉన్న జుమ్కీ స్టయిల్ హియర్ రింగ్స్ చాలా స్టులిష్‌గా కనిపిస్తాయి. మోడరన్ డ్రెస్స్‌లకు కూడా ఇలాంటి హియర్ రింగ్స్ సరిపోతాయి. ఈ హియర్ రింగ్స్ డిజైన్ హెవీ లెహంగా లేదా సాధారణ సూట్‌లకు మాత్రమే కాదు చీరలకు కూడా బాగుంటాయి. 

* సల్వార్ సూట్, లెహంగా లేదా చీరలకు మ్యాచింగ్‌గా ఈ తరహా జుమ్కీ స్టయిల్ హియర్ రింగ్స్ కూడా ప్రయత్నించవచ్చు. అలాగే ఈ స్టోన్ అండ్ పెర్ల్ వర్క్ హియర్ రింగ్స్ చాలా అందంగా కనిపిస్తాయి. 

* జుమ్కీ డిజైన్ కూడా ఖచ్చితంగా అందంగా కనిపిస్తుంది. డ్రెస్‌లకు ఆపోజిట్‌గా ఉండి.. స్పెషల్‌గా స్టులిష్‌గా కనిపించాలని ఆపోజిట్ రంగుల్లో హియర్ రింగ్స్ పెట్టుకుంటున్నారు. 

* జుమ్కీలను చీరలకు మ్యాచింగ్‌గా పెట్టుకుంటే మరింత అందంగా కనిపిస్తారు. చాలా సింపుల్‌గా, గ్రాండ్‌గా కనిపించాలంటే.. మాత్రమే ఏ జ్యువెలరీ పెట్టుకోకున్నా పర్వాలేదు. కానీ చెవులకు మాత్రం పెద్దగా, బొద్దుగా ఉండే జుమ్కీలను పెడితే మాత్రమే హుందాగా.. అందంగా కనిపించడం మాత్రం ఖాయం.