- పంజాబ్ ప్రభుత్వంపై హైకోర్ట్ అసహనం
- బిష్ణోయ్ ఇంటర్వ్యూ కేసులో తాజా దర్యాప్తుకు ఆదేశం
చండీగఢ్, అక్టోబర్ 30: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూకు సంబంధించిన కేసుపై బుధవారం విచారణ జరిపిన చండీగఢ్ హైకో ర్టు పంజాబ్ పోలీసులపై తీవ్రస్థాయిలో మం డిపడింది. ఈ కేసులో సిట్ దాఖలు చేసిన నివేదిక పోలీసులకు, గ్యాంగ్‌స్టర్‌కు మధ్య సం బంధం, నేరపూరితమైన కుట్రకోణం ఉందనే అనుమానాన్ని రేకెత్తిస్తున్నట్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
నేరస్థుడిని హీరోలా చూపించే ప్రయత్నం చేసినట్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ సమగ్ర దర్యాప్తు చేయాలని అదేశించింది. 2023లో భటిండా జైలు లో ఉండగా టీవీ ఛానల్‌కు బిష్ణోయ్ ఇచ్చిన ఇంటర్వ్యూను ప్రస్తావిస్తూ నేరస్థుడికి పోలీసులు అనుమతించి స్టూడియో తరహా ఏర్పాట్లు చేశారని అసహనం వ్యక్తం చేసింది. మరిన్ని నేరాలు చేసేందుకు అవకాశం కల్పించారని మండిపడింది.