calender_icon.png 9 January, 2025 | 11:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాయికా ప్రాధాన్య పాత్రలో..

18-10-2024 12:39:22 AM

కీర్తి సురేశ్ కథానాయికగా.. కె.చంద్రు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోందికీర్తి సురేశ్ కథానాయికగా.. కె.చంద్రు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఒక వైపు కీర్తి గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు కథానాయక ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రం కూడా కథానాయిక ప్రాధాన్యమున్నదే కావడం గమనార్హం. గురువారం కీర్తి సురేశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్ర టైటిల్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కీర్తి నటిస్తున్న చిత్రానికి ‘రివాల్వర్ రీటా’ అనే టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో ఒక సాధారణ మధ్యతరగతి యువతి పాత్రలో కీర్తి నటించారు. సరదాగా ఉండే యువతి జీవితం తరువాత ఎలాంటి మలుపులు తీసుకుందనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, మైమ్ గోపి, సునీల్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుధన్ సుందరం, జగదీశ్ పళనిస్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.