calender_icon.png 18 January, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12 మంది భారత సైనికుల వీర మరణం

18-01-2025 01:08:54 AM

న్యూఢిల్లీ, జనవరి 17: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున పోరాటం చేస్తు న్న 16 మంది భారత సైనికుల ఆచూకీ తెలియడం లేదని విదేశాంగశాఖ ప్రతినిధి రణ ధీర్ జైస్వాల్ శుక్రవారం ప్రకటించారు.  12 మంది భారత సైనికులు వీరమరణం పొం దారని వెల్లడించారు. ‘భారత్ నుంచి 126 మంది సైనికులు వెళ్లారు. వారిలో ఎక్కువ మంది యుద్ధం వీడి బయటకు వచ్చారు. మిస్ అయిన 16 మందిని త్వరగా స్వదేశానికి రప్పించేందుకు కృషి చేస్తున్నాం’ అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటికే బినిల్ మరణించగా.. అతడి సమీప బంధువుకు గాయాలయ్యాయి. దీంతో విదేశాంగశాఖ రష్యన్ రాయబార ప్రతినిధులతో చర్చలు జరిపి, భారత సైనికులను తిరిగి స్వదేశానికి పంపాలని విజ్ఞప్తి చేసింది.