చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఇదే నెల 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో విక్రమ్ మాట్లాడుతూ.. ‘మీరు చూపిస్తున్న ఎనర్జీ, క్రేజ్ బంగారంలా అనిపిస్తోంది. తెలుగు సినీప్రియులు ఎంతో ప్రత్యేకం.
ఈ స్టేజీ మీద నా సినిమాల్లోని పర్ఫార్మెన్సు లు ప్రదర్శించగా, చూసి ఎమోషన్ అయ్యా. ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనే స్ఫూర్తి కలిగింది. రంజిత్ నా డ్రీమ్ డైరెక్టర్. నాకు దొరికిన ది బెస్ట్ రోల్ ఇది. చిత్రాన్ని వరల్డ్ స్టేజీ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు జ్ఞానవేల్ రాజా’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయి న్లు మాళవిక మోహనన్, పాయల్ రాజ్‌పుత్, పార్వతీ తిరువోతు, చిత్ర దర్శక నిర్మాతలు రంజిత్, జ్ఞానవేల్ రాజా చిత్ర విశేషాలను వెల్లడించారు.
అతిథులుగా హాజరైన నిర్మాతలు ధనుంజయన్, దామోదర ప్రసాద్, నిర్మాత ఎస్‌కేఎన్, డైరెక్టర్లు కరుణ కుమార్, సాయి రాజేశ్, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధి శశి, డైలాగ్ రైటర్ రాకేందు మౌళి, హాలీవుడ్ నటుడు డానియల్ మాట్లాడి తమ చిత్రం గురించి అభిప్రాయాలు పంచుకున్నారు. మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.