calender_icon.png 21 December, 2024 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లి చేసుకున్న హీరో సిద్దార్థ్, అందాల అదితి

16-09-2024 02:47:50 PM

టాలీవుడ్‌లో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’, ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హ్యాండ్సమ్ యాక్టర్ సిద్దార్థ్ ఈరోజు అందాల నటి అదితి రావ్ హైదరీని పెళ్లి చేసుకున్నారు. వారు తమ రిలేషన్ షిప్ స్టేటస్ ను పెళ్లయిన వారిగా అప్ డేట్ చేస్తారు. వనపర్తి జిల్లాలోని ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ జంట పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.