calender_icon.png 25 January, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మిస్టర్ బచ్చన్’ ఇరగదీయబోతోంది ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో రవితేజ

14-08-2024 12:05:00 AM

హీరో రవితేజ, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబో మూవీ ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఆగస్టు15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున విడుదల కానున్న ఈ సినిమా ప్రిమియర్స్ 14వ తేదీ (నేడు) సాయంత్రం నుంచి ప్రిమియర్స్ ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రబృందం. ఈ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడుతూ.. “ఈ సినిమా అంతా కలర్‌ఫుల్‌గా ఉండబోతోంది. ఈ సినిమాలో నేను, భాగ్యశ్రీ అందంగా కనిపించబోతున్నాం.

ఈ క్రెడిట్ డీవోపీ బోస్‌కి దక్కుతుంది. డ్యాన్స్ మాస్టర్ భాను సాంగ్స్ ఇరగదీశాడు. కాసర్ల శ్యామ్, భాస్కర భట్ల, సాహితి చాలా మంచి పాటలు రాశారు. పృథ్వీ ఇందులో మూడు యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశాడు. మిక్కీ జే మేయర్ నుంచి ఇలాంటి మ్యూజిక్ వస్తుందని ఊహించలేదు. విశ్వ, వివేక్ బ్లాక్ బస్టర్స్ కొడుతూనే ఉండాలి. భాగ్యశ్రీ ఇప్పటికే ఊపు ఊపేస్తుంది. తనకి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. హరీశ్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. ‘మిస్టర్ బచ్చన్’ 14వ తారీఖు సాయంత్రం నుంచి ఇరగదీయబోతోంది.

జై సినిమా” అన్నారు. ఇంకా ఈ వేదికపై ఎమ్మెల్యేలు పార్థసారథి, గౌరు చరితారెడ్డిలతోపాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, డైరెక్టర్ హరీశ్ శంకర్, ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్, టీజీ వెంకటేశ్, రైటర్ బీవీఎస్ రవి, మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కేఆర్‌కే రాజు మాట్లాడి తమ అభిప్రాయాలు, అనుభవాలు పంచుకున్నారు. మూవీ టీమ్ అంతా ఈవెంట్‌లో పాల్గొన్నారు.