calender_icon.png 3 March, 2025 | 12:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘దిల్‌రూబా’.. స్టోరీ లైన్ ఊహిస్తే బైక్ గిఫ్ట్..!

02-03-2025 08:50:21 PM

హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘దిల్‌రూబా’. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయిన ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేశ్‌రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే ఈ చిత్ర కథానాయకుడు కిరణ్ అబ్బవరం ఆదివారం ఓ కాంటెస్ట్ అనౌన్స్ చేశారు.

‘దిల్‌రూబా’ స్టోరీ లైన్ ఊహించి చెప్పినవాళ్లకు ఈ సినిమాలో హీరో నడిపిన బైక్ గిఫ్ట్‌గా అందించబోతున్నారు. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజేతకు బైక్ అందించడంతో పాటు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో అదే బైక్ మీద సినిమా చూసేందుకు కిరణ్ అబ్బవరం వెళ్తారు. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన కంటెంట్, సాంగ్స్, ప్రెస్‌మీట్లలో టీమ్ చెప్పిన డీటెయిల్స్‌తో సినిమా స్టోరీ లైన్ గెస్ చేసిన వారెవరైనా ఈ స్పెషల్లీ డిజైన్డ్ బైక్ సొంతం చేసుకోవచ్చు. సో, ఇంకెందుకు ఆలస్యం మీరూ ట్రై చేయండి.