స్టార్ హీరో అజిత్‌కుమార్‌కు ప్రమాదం జరిగింది. ఎలాంటి గాయాలూ కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. అజిత్ ప్రొఫెషనల్ రేసర్‌గా అజిత్‌కు మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 11, 12 తేదీల్లో దుబాయ్ వేదికగా ‘24హెచ్’ కార్ రేస్ గ్రాండ్ ప్రీ జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన అజిత్.. రేస్ ప్రాక్టీస్ చేస్తుండగా, ఆయన కారు గోడకు బలంగా ఢీకొట్టింది.
దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. భద్రతా సిబ్బంది స్పందించి ఆయన్ను మరో కారులోకి తరలించారు. అజిత్ రేసింగ్‌ను అమితంగా ప్రేమిస్తారు. అందుకే మోటార్ సైకిల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ఓ స్టార్టప్‌ను సైతం ఏర్పాటు చేశారాయన. సినిమా షూటింగ్ బ్రేక్ దొరకడమే ఆలస్యం బైకులు, కార్లతో గడుపుతారాయన. కొద్ది రోజుల క్రితం అజిత్.. గంటకు 234 కిలోమీటర్ల వేగంతో కారును డ్రైవ్ చేయగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
హైదరాబాద్ నుంచి చెన్నై వరకు బైక్‌పైనే వెళ్లిన సందర్భాలెన్నో! అజిత్ చేతిలో ముఖ్యంగా ఇప్పుడు రెండు సినిమాలున్నాయి. డైరెక్టర్ మాగిల్ తిరుమేని తెరకెక్కిస్తున్న ‘విడా ముయర్చి’ సంక్రాంతి బరిలో నిలవాల్సి ఉండగా, వాయిదా పడింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ని ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇటీవల ప్రకటించిన విషయం విదితమే.