calender_icon.png 26 October, 2024 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

అనువంశిక అర్చకత్వమే శ్రేయస్కరం

29-07-2024 02:46:36 AM

సంప్రదాయ అర్చకత్వాన్ని ప్రభుత్వం పునరుద్ధరించాలి 

జాతీయ శైవాగమ సదస్సులో అర్చకుల డిమాండ్ 

నల్లగొండ జిల్లా చెరువుగట్టులో ఈ నెల 30 వరకు సదస్సు 

హాజరైన వివిధ రాష్ట్రాల ప్రధాన ఆలయాల అర్చకులు 

నలగొండ, జూలై 28 (విజయక్రాంతి): అనువంశిక అర్చకత్వమే శ్రేయస్కరమని, తెలంగాణలోని దేవాలయాల్లో సంప్రదాయ అర్చకత్వాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అర్చకులు, పండితులు కోరారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టులోని శ్రీసోమే శ్వర శివజ్ఞాన పీఠం వేదికగా ఆదిశైవ బ్రాహ్మ ణ అర్చక సంఘం, దేవదాయ ధర్మాదాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ శైవాగమ సదస్సు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది.

తొలి రోజు శైవాగమ విస్తృత పరిచయం, ఆహ్నిక వైశిష్ట్యం, శైవాగమోక్త ఆత్మార్థపూజ పరిచయం కార్యక్రమా లు కొనసాగాయి. ఈ సందర్భంగా వంశపారంపర్య అర్చకుల బదిలీలను తెలంగాణ దేవాదాయశాఖ వెంటనే నిలిపివేయాలని అర్చక సంఘం సభ్యులు కోరారు. ఆలయంలో దైవానికి.. అర్చకుడికి ఉన్న బంధం విడదీయరానిదని ఆగమనాలు సైతం చెప్తున్నాయని గుర్తు చేశారు. 2007లో సవరించి న అనువంశిక అర్చక చట్టాన్ని 2019 నుంచి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోందని, తెలంగాణ ప్రభుత్వం సైతం అమలుకు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని చిలు కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ తెలిపారు.

అర్చకుల సంక్షేమానికి కృషిచేస్తున్న రంగరాజన్ సేవలకు గుర్తుగా ఆయనను అర్చక శిరోమణి బిరుదుతో సత్కరించారు. సదస్సుకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్రధాన ఆలయాల అర్చకులు, పండితులు హాజరయ్యారు. ఈ నెల 30 వరకు సదస్సు కొన సాగనుంది. సోమవారం దేవతార్చన, మ హోత్సవ విధులు, పునరుద్ధరణ, వార, పక్ష, మాస అయనాది విశేష ఉత్సవాలకు మార్గాన్వేషణ, పవిత్రోత్సవ ఆవశ్యకత తదితరు అంశాలపై సమావేశం జరుగనుంది.