calender_icon.png 10 January, 2025 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇదిగో న్యూస్.. పోస్టు ప్లీజ్

05-01-2025 01:20:07 AM

సార్ సార్.. ప్లీజ్ నాకో పోస్టు ఇప్పించరూ..!ఇదీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిత్యం కనిపించే సీన్. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక.. మహేశ్‌కుమార్ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక య్యారు. కొత్త కార్యవర్గాన్ని నియమించడానికి కొత్త అధ్యక్షుడు కసరత్తు మొదలు పెట్టగా, ఆశావహులు గాంధీభవన్‌కు క్యూ కడుతున్నారు.

పార్టీకి చేసిన సేవలను, చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి మీడియాలో వచ్చిన న్యూస్‌ను ఆధారం చేసుకొని పోస్టుల కోసం దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టుకుంటున్నారు. తమ సాదకబాధకాలు మొర పెట్టుకొంటుండటంతో చేసేదేమీ లేక తప్పక న్యాయం చేస్తామంటున్నారట. దరఖాస్తులేమో ఎక్కువగా రాబట్టే.. ఏమి చేద్దాం అబ్బా అంటూ గాంధీభవన్ వర్గాలు తలపట్టుకుంటున్నాయి. 

సుంచు అశోక్