calender_icon.png 26 October, 2024 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇదిగో నా భర్తా.. పిల్లలు వీళ్లే!

05-07-2024 12:05:00 AM

బొద్దుగా, ముద్దుగా, చూడ ముచ్చటగా ఉండే కేరళ అందం నివేతా థామస్. నటన, నాట్యం, గానం.. ఇలా విభిన్న కళల్లో ప్రావీణ్యం ఉన్న ఈ అమ్మడుకు తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. గతంలో ఎన్టీఆర్, నాని లాంటి స్టార్ హీరోల సరసన నటించిందీ భామ. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే నివేతా ఇటీవల తన ఎక్స్ ఖాతాలో పెట్టిన ఓ పోస్ట్ బాగా వైరల్ అయింది. ఆ పోస్ట్‌ను చూసిన వారంతా నివేతా థామస్ పెళ్లి అంటూ ప్రచారం చేశారు. ఈ ప్రచారంపై నివేతా తాజాగా జరిగిన ‘35 చిన్న కథ కాదు’ టీజర్ రిలీజ్ వేడుకలో వివరణ ఇచ్చింది. “ఈ సినిమా ప్రచారంలో భాగంగా నేను సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేశా.

దాన్ని చూసి నాకు పెళ్లి కానుందంటూ భావించారు.. వార్తలు కూడా రాశారు.. ఇదంతా నిజమేనేమో అనుకొని మా అమ్మ ఆ ఫొటోను నాకు పంపారు. దీంతో నేను ‘ఔనా అమ్మా.. నా కోసం అబ్బాయిని మీరెప్పుడు చూశారు’ అని అడిగా. తర్వాత నిదానంగా మా అమ్మకు అసలు విషయం చెప్పా” అని పేర్కొన్నది నివేతా. అయితే “ఆ ఫొటోకు పెట్టిన క్యాప్షన్ అర్థం కాక పెళ్లి అని ప్రచారం చేశారు కదా ‘నాకు పెళ్లుంది. ఈయనే నా భర్త. వీళ్లే నా ఇద్దరు పిల్లలు అరుణ్, వరుణ్‌” అంటూ సినిమాలో తన భర్తగా నటించిన విశ్వదేవ్‌ను, తనకు కుమారులుగా నటించిన వారిని చూపిస్తూ అసలు సంగతి బయటపెట్టింది నివేతా థామస్.