calender_icon.png 27 October, 2024 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొబైల్ బిల్లుల ఆదాకు టిప్స్ ఇవిగో!

30-06-2024 12:46:03 AM

రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్‌లు మొబైల్ చార్జీలు జూలై 3 నుంచి పెరగనున్నాయన్న సంగతి తెలిసిందే. టెలికాం కంపెనీలు వాటి ఆదాయాన్ని పెంచుకునే లక్ష్యంతో ప్రకటించిన పెంపుదలతో కోట్లాదిమంది చందాదారులపై అదనపు భారం పడనుంది. అయితే ఈ భారాన్ని కొంతమేర తగ్గించుకునేందుకు కొన్ని టిప్స్..

షెడ్యూలింగ్ రీచార్జ్

ప్రిపెయిడ్ చందాదారులు:  ప్రస్తుత మొబైల్ చార్జీలే వర్తింపుచేసుకునే కీలక అవకాశం ప్రిపెయిడ్ చందాదారులకు ఉన్నది. అదేమిటంటే జూలై 3లోపు వారి ప్లాన్‌ను రీచార్జ్ చేసుకోవడమే. అలా చేసుకున్న రీచార్జ్ మీ ప్రస్తుత ప్లాన్ కాలపరిమితి ముగిసిన తర్వా తే పనిచేయడం ప్రారంభిస్తుంది. తద్వారా జూలై 3 తర్వాత రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం రాదు. ఈ సదుపాయం రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్‌లే అందిస్తున్నాయి. ఈ విధంగా రీచార్జ్‌ను షెడ్యూల్ చేసుకునే సదుపాయాన్ని వొడాఫోన్ ఐడియా కల్పించడం లేదు. రీచార్జ్‌ను షెడ్యూల్ చేసుకుంటే ముఖ్యంగా దీర్ఘకాలిక ప్లాన్లు ఉన్నవారికి ఖర్చులు బాగా ఆదా అవుతాయి.

ఉదాహరణకు ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న రోజుకు 1.5జీబీ అందించే రూ.239 ప్యాక్ ధర రూ. 299కు చేరుతుంది. అంటే 25 శాతం పెంపు. ఈ రెండు కంపెనీల వార్షిక డేటా ప్యాక్‌ల ప్ర స్తుత చార్జీ, పెంచిన చార్జీ మధ్య రూ. 600 వర కూ వ్యత్యాసం ఉన్నది. అటువంటి ప్యాక్‌లు ఉన్నవారు ఇప్పుడే రీచార్జ్ చేసి, షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇలా షెడ్యూల్ చేసుకునే 50 రీచార్జ్‌లవరకూ (నెలవారీ లేదా వార్షికంగా) క్యూలో పెట్టుకోవచ్చని జియో వెల్లడిస్తున్నది. ఇలా క్యూలో ఉంచుకునేందుకు ఎన్ని రీచార్జ్‌లను అనుమతిస్తున్నదీ ఎయిర్‌టెల్ ఎటువంటి సమాచారాన్నీ ఇవ్వలేదు. 

పోస్ట్‌పెయిడ్ యూజర్లు: ప్రిపెయిడ్ చందాదారుల తరహాలో పోస్ట్‌పెయిడ్ యూజర్లు టారీఫ్‌ల పెంపును తక్షణమే తప్పించుకునే అవకాశం ఉండదు. కానీ వారి మంథ్లీ డేటా వినియోగాన్ని సమీక్షించుకుని, ప్రస్తుత ప్లాన్‌కంటే తక్కువ డేటానే వాడుకుంటున్నట్టు గమనిస్తే రీచార్జ్ గడువులోపుగా తక్కువ ఖరీదుగల ప్లాన్స్‌లోకి మారవచ్చు. దీని తదుపరి బిల్లింగ్ సైకిల్‌లో వ్యయాలు తగ్గుతాయి. కొత్త టారీఫ్‌లు అమలులోకి వచ్చేలోపే ఈ వ్యూహాత్మక ప్రణాళికను పాటిస్తే ప్రయోజనం కలుగుతుంది. 

ఎయిర్‌టెల్ పెంపు ఇలా..

ఎయిర్‌టెల్ వివిధ ప్లాన్ల ధరల్ని 10 నుంచి 21 శాతం వరకూ పెంచింది. రోజుకు 2జీబీ డేటాను, అన్‌లిమిటెడ్ కాలింగ్ సేవల్ని అందించే 365 రోజుల కాలపరిమితిగల ప్లాన్ రేటు రూ. 600 మేర పెరిగి రూ. 2,999 నుంచి రూ. 3,599కు చేరుతుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ ప్లాన్ క్యాటగిరీలో 28 రోజుల వ్యాలిడిటీతో 2జీబీ డేటా ఆఫర్ చేసే రూ.179 ప్లాన్ ధరను రూ. 199కు పెంచింది. ఇదే క్యాటగిరీలోని రూ.455 ధరను రూ. 509కు, రూ.1,799 ధరను రూ. 1,799కు చేర్చింది. డెయిలీ డేటాను అందించే క్యాటగిరీలో 56 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5 జీబీ ప్లాన్ ధర రూ. 479 నుంచి రూ. 579కు పెరుగుతుంది.

రోజుకు 1జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీగల ప్లాన్ చార్జీ రూ.265 నుంచి రూ. 299కు పెరుగుతుంది. ఇదే వ్యాలిడిటీతో రోజుకు 1.5జీబీ ఆఫర్ చేసే ప్లాన్ ధర రూ. 2999 నుంచి రూ.349కు పెరుగుతుంది. 84 రోజుల వ్యాలిడిటీ కోరుకునే చందాదారులు ఇకనుంచి రూ.140 అదనంగా ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఈ వ్యాలిడిటీలో రోజుకు 1.5జీబీ డేటా ప్లాన్ చార్జీ రూ.719 నుంచి రూ. 859కు, రోజుకు 2జీబీ డేటా ఆఫర్ చేసే ప్లాన్ ధర రూ. 839 నుంచి రూ. 979కు పెరుగుతుంది. 

జియో కొత్త చార్జీలివి..

రిలయన్స్ జియో వివిధ ప్లాన్ల చార్జీలను 12 శాతం మేర పెంచింది. రూ.155 ప్లాన్ ధర రూ.189కు చేరుతుంది. ప్రాచుర్యం పొందిన 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన రూ.239 ప్లాన్ ధర రూ. 299కు,  84 రోజుల వ్యాలిడిటీగల రూ.666 అన్‌లిమిటెడ్ ప్లాన్ ధర 20 శాతం పెరిగి రూ. 799కు పెరుగుతుంది. రూ.1,559 ధరగల సంవత్సరపు రీచార్జ్ ప్లాన్‌ను రూ. 1,899కి, రూ. 2,999 ప్లాన్ ధరను రూ. 3,599కి పెంచింది.

రూ.209 ప్లాన్ ధర రూ. 249కు, రూ.299 ధర రూ. 349కు, రూ.349 ప్లాన్ ధర రూ. 399కు, రూ. 399 ప్లాన్ ధర రూ. 449కు పెరుగుతుంది. రెండు నెలల ప్లాన్స్‌కు సంబంధించి రూ. 479 ధర రూ.579కు, రూ.533 ధర రూ. 629కు చేరుతుంది. మూడు నెలల ప్లాన్స్‌లో రూ. 395 ధర రూ. 479కు, రూ. 666 ధర రూ. 799కు, రూ. 719 ధర రూ.859కు, రూ. 999 ధర రూ. 1,199కు పెరుగుతుంది. 15జీబీ పోస్ట్‌పెయిడ్ డాటా ప్లాన్ ధరను రూ. 399 నుంచి రూ. 449కు చేర్చింది.