calender_icon.png 23 October, 2024 | 9:55 PM

హెర్బల్ టీ!

15-07-2024 12:05:00 AM

ఆయుర్వేదంలో తులసి మొక్కను వివిధ జబ్బుల నివారణకు వాడవచ్చు. ఇది ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న తులసి వానకాలంలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఈ తులసి ఆకులతో చేసిన హెర్బల్ తాగితే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. 

  1. ఆయుర్వేదం కూడా తులసిని ఉపయోగించమని సిఫార్సు చేస్తున్నది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బ్యార్టీరియాతో పోరాడటానికి శరీరానికి శక్తిని అందిస్తుంది. 
  2. తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు ఫైటో న్యూట్రియెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తులసి అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం వంటి లక్షణాలను తగ్గిస్తుంది. 
  3. దీనిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేంటరీ లక్షణాలు దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నోటి దుర్వాసనతో పోరాడుతుంది. 
  4. తులసి రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మధుమేహం లేదా ఫ్రీ ఉన్నవారికి మంచి ఔషధం. 
  5. తులసిలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి దీన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.