1940వ దశకంలో బాలీవుడ్‌లో కెల్లా అందమై న తారగా పేరుగాంచారు. సైరాబాను తల్లి నసీమ్ బాను. ‘బ్యూటీ క్వీన్’ అనే బిరుదు పొందిన ఆమె కొన్ని ఏళ్ల పాటు ప్రేక్షకులని అలరించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నటించాకా, కుమారై సైరాబాను సినిమాల్లోకి రావడంతో, నసీమ్ నటనను విరమించుకున్నారు. ఆ తర్వాత ఆమె ఫ్యాష న్ డిజైనింగ్‌లోకి ప్రవేశించారు. తన కుమారై సినిమాలకు ఎన్నో దుస్తులు రూపొందించారు.
1961లో ‘జంగ్లీ’ సినిమాతో.. షమ్మీ కపూర్ పక్కన హీరోయిన్‌గా నటించింది. ‘జంగ్లీ’ హిట్‌తో సైరాకు స్టార్స్ పక్కన నటిం చే అవకాశాలు క్యూ కట్టాయి. అందులో రాజేంద్ కుమార్ హీరోగా ‘ఆయీ మిలన్ కీ బేలా’ కూడా ఉంది. సైన్ చేసింది సైరా. ఆ సినిమా సెట్స్‌లో ఆమెను చూసిన రాజేంద్ర కుమార్ ‘తుమ్హే క్యా దూ మై దిల్ కె సివా’ (నా హృదయాన్ని తప్ప నీకేం ఇవ్వగలను) అంటూ సాగే ‘ఆయీ మిలన్ కీ బేలా’ లోని పాటలో సైరాకు అంకితం చేశారు. ఆమె నటించిన బ్లఫ్ మాస్టర్, విక్టోరియా నెం. 203, హేరా ఫేరి, బైరాగ్ వంటివి బ్లాక్ బస్ట ర్ హిట్స్. జంగ్లీ మూవీలో సైరాబాను రాజకుమారి పాత్రకుగాను ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు.
దిలీప్ కుమార్‌తో ప్రేమ..
సైరాబాను బర్త్‌డేకు దిలీప్ కుమార్‌ను అతిథిగా ఆహ్వానించింది తల్లీ నసీమ్. పుట్టిన రోజు పార్టీలో తన అభిమాన హీరో కనిపించడంతో ‘దిలీప్ సాబ్’ అంటూ సంభ్రమాశ్చ ర్యాలకు లోనైంది సైరా. అలా కొన్నేళ్లపాటు సైరా, దిలీప్‌లు కూడా తమ మధ్య మూగప్రేమ నడిచింది. అయితే వీరిద్దరి ప్రేమను పెళ్లిపీటలెక్కించిన ఘనత మాత్రం సైరా తల్లి నసీమ్ బానుకే దక్కుతుంది. ఎందుకంటే 1966లో ఇద్దరికి దగ్గర ఉండి వివాహం జరిపించింది.
పెళ్లి తర్వాత..
ఆమెకు 12.. అతడికి 34.. ఇద్దరి మధ్య సుమారుగా 22 ఏళ్ల వయోభేదం. పెళ్లి తర్వా త చాలామంది వీళ్లిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ గురించే మాట్లాడుకున్నారు. పలు రకాలుగా కామెంట్లు వచ్చినా వాటిని పట్టించు కోకుండా ప్రతి సందర్భంలోనూ ఒకరికొకరుగా ముందుకు సాగారు. పెళ్లయ్యాక ఆరేళ్లకు అంటే 1972లో మొదటిసారి గర్భం దాల్చిన సైరా. ఎనిమిదో నెలలో ఆమెకు అబార్షన్ అయింది. పుట్టిన బేబీ కూడా దక్కలేదు.
అయినా దిలీప్‌కుమార్ నన్ను వదిలిపెట్టలేదు. ఓ ఇంటర్య్యూలో దిలీప్ నా కోహినూర్ వజ్రం.. నా జీవితంలో అల్లాను రెండే రెండు కోరికలు కోరాను. మా అమ్మలా ఫేమస్ కావాలని, దిలీప్ కుమార్‌లాంటి భర్త దొరకాలని. అల్లా రెండింటినీ నెరవేర్చాడు అని చెప్పుకొచ్చింది. దిలీప్‌కుమార్ సరసన సగిన, గోపి, బైరాగ్, దుని యా వంటి హిట్ సినిమాల్లో నటించింది సైరాబాను.
సైరాబాను.. బాలీవుడ్‌లో మూడు దశాబ్దాల పాటు 40కిపైగా చిత్రాల్లో నటించి.. ఓ వెలుగు వెలిగినా అందాల తార. 12 ఏళ్ల వయసులో తాను ఇష్టపడ్డా లెజండరీ నటుడు డిలీప్‌కుమార్‌ను పెళ్లాడింది. అప్పటికీ ఆయన వయసు 34 ఏళ్లు.. ఇద్దరి మధ్య 22 ఏళ్ల వయసు భేదం. ఎంతమంది ఎన్ని రకాలుగా కామెంట్లు చేసినా ఆయన పట్ల ఉన్న అభిమానం, ప్రేమను ఏమాత్రం వొదులుకోలేదు. 80 ఏళ్ల వయసులో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ దిలీప్ కుమార్ పట్ల ఉన్న ప్రేమను, పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉన్నది
ఈ అందాల భామ..
ఆయన జ్ఞాపకాలు పదిలం..
జూలై 7, 2001లో ముంబైలోని హిందు జా హాస్పిటల్‌లో అనారోగ్యంతో దిలీప్ కుమార్ తుదిశ్వాస విడిచారు. భర్త మరణించి ఏడాది పూర్తయినా సందర్భంగా ఆమె ఓ బాలీవుడ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్యూలో.. 56 ఏళ్ల తమ వైవాహిక బంధానికి ముగింపు పలికి దిలీప్ వెళ్లిపోయారనీ, ఆయన జ్ఞాపకాలు మాత్రం పదిలంగా ఉన్నాయనీ ఆమె వెల్లడించారు. ‘మన జీవితంలోని వచ్చిన కొంతమంది వ్యక్తుల్ని రిప్లేస్ చేయడం చాలా కష్టం. ప్రపంచంలోని ధనమంతా ఒక వైపు, దిలీప్ సాబ్‌ను మరో వైపు ఉంచి నీకు ఏది కావాలని అడిగితే నేను దిలీప్ సాబ్‌నే కోరుకుంటాను’ అని భావోద్వేగంతో చెప్పారు సైరాబాను. భర్త మరణం తర్వాత సైరాబాను ఇల్లు వదిలి బయట కు రాలేదు. నెలల
తరబడి ఎవరినీ కలవకుండా ఇంట్లోనే ఉండిపోయారు.