calender_icon.png 18 January, 2025 | 10:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమె డ్రెస్ ‘క్యూ ఆర్ కోడ్’లా ఉంది

07-07-2024 02:04:58 AM

రిషిసునాక్ రాజీనామా ప్రసంగంలో అక్షతామూర్తి ధరించిన డ్రెస్‌పై ట్రోల్స్

లండన్, జూలై 6: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో రిషిసునాక్ సారథ్యంలోని కన్జర్వేటివ్ పార్టీ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో లేబ ర్ పార్టీ  650 స్థానాలకు గాను 412 సీట్లు కైవసం చేసుకుంది. రిషి సునాక్ సారథ్యం వహించిన టోరీలు కేవలం 121 స్థానాలకే పరిమితమయయారు. ఎనికల్లో ఓటమి అనంతరం రిషిసునా క్ ౧౦ డౌనింగ్ స్ట్రీట్‌లో చివరి ప్రసంగం చేశారు. ఆ సమయంలో రిషి వెనుకాలే నిల్చున్న ఆయన భార్య అక్షతా మూర్తి ధరించిన డ్రెస్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. యూకే జెండాను పోలిన ఎరుపు, తెలపు, నీలిరంగు గౌన్‌ను అక్షతా మూర్తి ధరించారు.

దీని ధర భారత కరెన్సీలో దాదాపు రూ.42వేలకు పైగా ఉంటుంది. కాగా ఈ డ్రెస్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఆ డ్రెస్ జీబ్రా క్రాసింగ్‌లా ఉందని ఒకరు పోస్టు చేస్తే కాదు క్యూ ఆర్ కోడ్‌లా ఉందని ఒకరు.. జుగుప్సాకరంగా ఉందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆమె చేతిలో పట్టుకున్న గొడుగు గురించి కూడా నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. కాగా రిషిసునాక్ తన ప్రసంగం అనంతరం ఆ దేశ కింగ్ చార్లెస్ ను కలిసి తన రాజీనామా పత్రం సమర్పించారు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తు న్నాని, కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు రిషి స్పష్టం చేశారు.