మెట్రో యాజమాన్యంతో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంస్థ
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (విజయక్రాంతి): వినియోగదారులకు ఆరోగ్యకరమైన నూనె అందిస్తున్న ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ తనసంస్థ మార్కెటింగ్‌లో మరో ముందడుగు వేసింది. వినియోగదారులకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా మూసాపేట్ మెట్రో రైల్వే స్టేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
మూసాపేట్ మెట్రోస్టేషన్ వేదికగా తమ బ్రాండ్ ప్రచారాన్ని మరింత విస్తృతం చేయనుంది. ఫ్రీడ మ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖరరెడ్డి మంగళవారం మాట్లాడుతూ.. మూసాపేట మెట్రో స్టేషన్‌తో తాము భాగస్వామ్యం కుదుర్చుకున్నామని.. ఇకపై ఈ మెట్రోస్టేషన్‌ను ‘ఫ్రీడమ్ ఆయిల్ మూసాపేట మెట్రో స్టేషన్’గా పిలవబడుతుందని తెలిపారు.
ఇందులో భాగంగా ఫ్రీడమ్ బ్రాండింగ్ యాడ్స్‌ను మెట్రోస్టేషన్‌లో ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దే శ్యం.. తమ ఫ్రీడమ్ బ్రాండ్ ఆయిల్ ప్రయోజనాలపై వినియోగదారులకు మరింత అవ గాహన కల్పించడంతో పాటు వాటి పోషకాహారం వంటి వాటిని వివరించడం అని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. తాజా భాగస్వా మ్యం ద్వారా వేలాది మంది ప్రయాణికులను చేరుకునేందుకు చక్కటి అవకాశం లభించిందని తాము భావిస్తున్నానని తెలిపారు.