calender_icon.png 27 January, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టు మెట్లెక్కిన ‘కోడి’

27-01-2025 10:07:21 AM

ఉప్పర్ పల్లి మెట్రోపాలిటన్ జడ్జి సమక్షంలో వేలం!

సంక్రాంతినాడు మొయినాబాద్ లోని ఓ ఫాం హౌస్ లో కోడి పందేలు 

రాజేంద్రనగర్: ఓ కోడి కోర్టు మెట్లు ఎక్కింది. న్యాయమూర్తి సమక్షంలో దానికి వేలంపాట నిర్వహించారు. వేలంలో 2500 పలికింది. ఈ సంఘటన రాజేంద్రనగర్ లోని ఉప్పర్ పల్లి కోర్టులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ఫామ్ హౌస్ లో పందెం కోడి తో పాటు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఈక్రమంలో గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ జరిపారు. పట్టుబడ్డ పందెం కోడి తో పాటు నిర్వాహకులను రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి వేలం నిర్వహించాలని సూచించారు. దీంతో  కోర్టు ఆవరణలో జడ్జి సమక్షంలో వేలం వేయగా.. 500 నుంచి మొదలు అయ్యి 2,500 వరకు వేలం జరిగింది.  చివరికి 2500 రూపాయలకు రాజేంద్రనగర్ గగన్ పహాడ్ వాసి తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణ దానిని దక్కించుకున్నారు.