రాంచీ,(విజయక్రాంతి): జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ ఆదివారం జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్‌ను కలిసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వాదనలు వినిపించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ముందు ఆయన ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా హేమంత్ సోరెన్ మాట్లాడుతూ.. తాజాగా జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐఎన్డీఐఏ ఘన విజయం సాధించింది. దీంతో హేమంత్ తన కారులో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని, అలాగే కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు, సంకీర్ణ నేతా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న పత్రాలను సమర్పించారు.
దీంతో గవర్నర్ సోరెన్ తాత్కాలిక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని కోరారు. అనంతరం నవంబర్ 28న హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం జరుగనుందని తెలిపారు. ఇందుకోసం సోరెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి గవర్నర్ ను ఆహ్వనించారు. నవంబర్ 15, 2000న బీహార్ నుంచి ఏర్పాటైన జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వెంటనే ఐఎన్డీఐఏ రాష్ట్రంలోని మహాకూటమి సభ్యులు ఆయనను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.