మహబూబ్ నగర్, జనవరి 9 (విజయ క్రాంతి) : ఎలాంటి సమయాల్లో నైనా ఆపదలో ఉన్నవారికి పోలీస్ వ్యవస్థ అండగా ఉంటుందని డి.ఎస్.పి వెంకటేశ్వర్లు భరోసా కల్పించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పంచవటి విద్యాలయంలో భరోసా, షిటిం సభ్యులతో విద్యార్థులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
షీ టీమ్ అంటే ఏమిటి ? అది ఎలా పని చేస్తుంది ? అది ఎలా ఉపయోగపడుతుంది అనే అంశాలను వివరించారు. ఈవ్ టీజింగ్ సోషల్ మీడియా వేధింపులను పెంచడం, మహిళల అక్రమ రవాణా, బాలల దుర్వినియోగం, బాల్య వివాహాలు, బాల కార్మికులు, చైల్డ్ లైన్ 1098, బోండెడ్ లేబర్ పోస్కో చట్టం పని వేధింపులు, మంచి ట, చెడు ట, యాంటీ-ర్యాగింగ్, సెల్ఫ్ డిఫెన్స్, సైబర్ క్రైమ్ షీటీమ్ ఎల్లప్పుడూ సమస్యల్లో సహాయం చేస్తుందన్నారు.
ఎక్కడైనా సమస్యలు ఉంటే అత్యవసరంగా సంప్రదించండి 100, షీటీమ్ నంబర్ 8712659365 కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు. భరోసా సెంటర్ అనేది తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక సేవా కేంద్రం, ఇది మహిళలు, పిల్లలు, కుటుంబ హింస బాధితుల కోసం మద్దతు, న్యాయం పొంద డానికి సహాయపడుతుందన్నారు.
భరోసా సెంటర్ వివిధ విభాగాలతో పనిచేస్తూ, బాధితులకు ఒకే చోట అన్ని సేవలను అందించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.బాధితుల సమస్యలకు న్యాయ పరమైన పరిష్కారం కోసం లీగల్ కౌన్సిలింగ్ అందిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్, భరోసా ఇన్చార్జి డబ్ల్యూ ఎస్‌ఐ సుజాత, షీ టీం సభ్యులు వనజ రెడ్డి. రఘు పాల్గొన్నారు.