calender_icon.png 14 October, 2024 | 5:57 AM

వారికి సాయం చేస్తే మాపై దాడి చేసినట్లే

14-10-2024 03:42:28 AM

అమెరికా మిత్రదేశాలకు ఇరాన్ వార్నింగ్

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా మిత్రదేశాలకు ఇరాన్ హెచ్చరించింది. టెల్‌అవీవ్‌కు సాయమందిస్తే ఇరాన్‌పై దాడికి పాల్పడినట్లేనని, అలాంటి పరిస్థితులు ఏర్పడితే టెహ్రా న్ కూడా విరుచుకుపడుతుందని పేర్కొంది. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతిస్తున్న నేపథ్యంలో దాని మిత్రదేశాలకు ఇరాన్ ముంద స్తు హెచ్చరికలు జారీచేసింది.

ఇరాన్ ఇన్నా ళ్లూ హెజ్‌బొల్లా, హమాస్‌లకు పరోక్షంగా సాయం చేస్తూ వచ్చింది. హెజ్‌బొల్లా కీలక నేతలను హతమార్చిన నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై దాడికి దిగినట్లు స్వయంగా ప్రకటిం చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇజ్రాయెల్ మద్దతు దేశమైన అమెరికా..

ఇరాన్‌ను కట్టడిచేసేందుకు ఆంక్ష లు విధించింది. ఆ దేశ ఆదాయ మార్గాలను నిలిపేసి పరోక్షంగా దెబ్బకొట్టాలని భావిస్తోంది. అందుకే ఇరాన్‌కు చెందిన పెట్రో లియం, పెట్రోకెమికల్ రంగాలపై ఆంక్షలు పెంచింది. ఈ క్రమంలోనే ఇరాన్‌కు చెందిన 16 సంస్థలు, 17 నౌకలను బ్లాక్ ప్రాపర్టీగా గుర్తించినట్లు అమెరికా ట్రెజరీ పేర్కొంది.