15-04-2025 12:00:00 AM
మాజీ మంత్రి, సినీ నటుడు బాబుమోహన్
ముషీరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): విద్య, వైద్యంతో పాటు ఆర్థికంగా వెనుకబడి వారికి చేయిత అందించేందుకు తన కుమారుడి పేరుపై ’పవన్ బాబు మో హన్ చారిటబుల్ ట్రస్ట్’ను ప్రారంభించినట్లు మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బాబు మో హన్ మాట్లాడుతూ తన కుమారుడు 2003 లో రోడ్డు ప్రమాదంలో మరణించాడని, ఆ సమయంలోనే ట్రస్ట్ పెట్టాలని అనుకున్నానని, కానీ రాజకీయాల్లో ఉండటం వల్ల సా ధ్యం కాలేదన్నారు.
ఇప్పుడు తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, పూర్తి స్థాయి లో ట్రస్ట్ కోసం పని చేస్తానని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన సమీప అనే యువతి చదువు బాధ్యతలను తాను తీసుకున్నట్లు బాబు మోహన్ తెలిపారు. కోయ సామాజిక వర్గానికి చెందిన తనకు బాబు మోహన్ లాంటి వారు సహాయం చేస్తారని అనుకోలేదని యువతి సమీప తెలిపింది. చిన్ననాటి నుండి కూలీ పనులు చేసుకుంటూ బిటెక్ పూర్తి చేశానని, ట్రస్ట్ సహకారంతో ఎంటెక్ పూర్తి చేసి ఫారెస్ట్ రేంజ్ అధికారిణి అవుతానని సమీప ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. త్వరలోనే అన్ని జిల్లాల్లో ట్రస్ట్ కో-ఆర్డినేటర్లను ప్రకటిస్తామని తెలిపారు. ఇతర పూర్తి సమాచారం కోసం 8919511215 నెంబరులో సంప్రదించాలని కోరారు.