09-04-2025 07:31:05 PM
గుడిహత్నూర్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన సన్న బియ్యం పథకం ఎంతో చేయూత ఇస్తుందని ఏఐసీసీ సభ్యులు డాక్టర్ నరేష్ జాదవ్, కాంగ్రెస్ పార్టీ అదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ సుగుణ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో అదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలం తోషం గ్రామంలో సన్న బియ్యం లబ్ధిదారులు పోగుల మమత శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు సన్న బియ్యం పథకంపై వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. సన్న బియ్యం పథకంలో పేదలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కరుణాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి షహీద్, ఆరిఫ్ ఖాన్, ఎస్సీ సెల్ అధ్యక్షులు నరేష్, మహిళ నాయకురాలు అనసూయ, గణేష్, తదితరులు పాల్గొన్నారు.