calender_icon.png 20 January, 2025 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద వైశ్య కుటుంబానికి చేయూత...

20-01-2025 06:35:11 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో గత కొద్ది రోజుల క్రితం మాడ మహేందర్ అనే నిరుపేద వైశ్యుడు మృతి చెందాడు. వారి ఆర్థిక పరిస్థితిని చూసి మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికా శ్రీనివాస్ సూచన మేరకు ఆర్యవైశ్య సంఘ పట్టణ అధ్యక్షుడు సుద్దాల హరిశంకర్, సోమవారం కార్యవర్గ సభ్యులు దాతల సహకారంతో దహన సంస్కారాలు, వారి పోషణ కొరకు 1 లక్ష 18 వేల రూపాయలను విరాళాలుగా సేకరించి వారి కుటుంబానికి సహాయ సహకారాలు అందించారు. మాడ మహేందర్ కుటుంబ సభ్యులు చైర్మన్ గందే రాధికా-శ్రీనివాస్, ఆర్య వైశ్య సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు కోశాధికారి రేణికుంట్ల సురేష్, పాల కృష్ణ మూర్తి, చందా విద్యాసాగర్, భూపతి లచ్చన్న, ఐత సురేందర్, అప్పన రమేష్, చందా నగేష్ తదితరులు పాల్గొన్నారు.