calender_icon.png 13 February, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు సహకరించాలి

13-02-2025 07:51:12 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): అడవుల్లో వేసవి కాలంలో జరిగే అగ్నిప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని మణుగూరు ఎఫ్ డి ఓ సయ్యద్ మక్సుద్ మోహినుద్దీన్ అన్నారు. గురువారం అశ్వాపురం రేంజ్ పరిధిలోని ఎలకలగూడెం, కొత్తూరు గ్రామాలలో అడవులలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అటవీ అగ్ని ప్రమాదాలు, నివారణ చర్యలు, వన్యప్రాణి సంరక్షణ గురించి ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, అటవీ చుట్టు పక్కల గ్రామాలలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని, ఒకవేళ జరిగితే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని, అటవీ సంరక్షణలో అందరమూ భాగస్వాములు అవ్వాలని కోరారు. అనంతరం బండ్ల వారి గుంపు గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న ఫారెస్ట్ స్టేషన్ ను సందర్శించారు. ఈ కార్యకమంలో అశ్వాపురం రేంజ్ ఆఫీసర్ రమేష్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్స్ ధనలక్ష్మి, వెంకట్రావు, బీట్ ఆఫీసర్లు బాబురావు, వాణి, సునీల్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.