01-03-2025 12:44:49 AM
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పీసీసీ చీఫ్ మహేశ్ కౌంటర్
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): చేతనైతే రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయాలని, లేకపోతే విమర్శలు వద్దంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పీసీ సీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కౌం టర్ ఇచ్చారు. తెలంగాణ మఖ్యమంత్రి నేనా? రేవంత్‌రెడ్డినా? అన్న కేంద్రమం త్రి వ్యాఖ్యలపై మహేశ్‌గౌడ్ స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రానికి సీఎం ఎవరో ప్రజలందరికీ తెలుసునని హితవు పలికారు.
ఎవరి పరిధిలో వారు సక్రమంగా పని చేస్తే గౌరవం ఇస్తామన్నారు. కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజ య్‌లను కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో సాయం కోరితే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిం చారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చి న హామీలను నెరవేర్చకుండా కేంద్రం వివక్ష చూపుతుంటే రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న వీళ్లు మౌనంగా కూ ర్చున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.