calender_icon.png 27 October, 2024 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉక్రెయిన్‌కు జీ7 దేశాల సాయం

27-10-2024 12:15:31 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: రష్యాతో యుద్ధం వల్ల ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు జీ7 దేశాలు  అండగా నిలిచాయి. ఆ దేశానికి సుమా రు 50 బిలియన్ డాలర్ల రుణం అంది ంచేందుకు నిర్ణయించాయి. తాజాగా వాషింగ్టన్‌లో ఐఎంఎఫ్, వరల్డ్‌బ్యాంక్ నిర్వహించిన సమావేశాల్లో జీ7 దేశాల నాయకులు పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లో ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి ఆర్థిక రుణం అందించాల ని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఉక్రెయిన్‌పై దాడి రష్యా ప్రారంభించిన వెంటనే జీ7 కంట్రీస్ తమ దేశాల్లో ఉన్న రష్యాకు చెందిన ఆస్తులను అధీనంలోకి తీసుకొన్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై వచ్చి న లాభాలను ఉక్రెయిన్‌కు రుణంగా అందించనున్నట్లు జీ7 దేశాధినేతలు తెలిపారు. ఈ ఏడాది చివరికి నిధుల పంపిణీని ప్రారంభించాలని నిర్ణయించారు. ఉక్రెయిన్‌కు అందించే 50 బిలి యన్ డాలర్లలో 20 బిలియన్ డాలర్లు అమెరికా నుంచి, మిగిలిన 30 బిలియన్ డాలర్ల రుణాలు ఐరోపా, జీ7 భాగస్వామ్య దేశాల నుంచి అందుతాయని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పేర్కొన్నారు.