calender_icon.png 10 March, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద యువతి వివాహానికి సాయం

10-03-2025 12:00:00 AM

జగిత్యాల అర్బన్, మార్చి9 (విజయక్రాంతి): శ్రీభక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమతి ఆధ్వర్యంలో నిరుపేద యువతి వివాహానికి ఆదివారం ఆర్థిక సాయం అందించారు. రాయికల్ నిరుపేద కుటుంబానికి చెందిన బోగ లావణ్య కూతురు అశ్విని వివాహం నిశ్చయం కాగా, పెళ్లి కోసం రూ. 10 వేలు అందజేశారు.

గీతా సిల్క్ హౌజ్ అధినేత కస్తూరి జగదీశ్వర్ జ్ఞాపకార్ధం ఆయన కుమారుడు కస్తూరి శశిధర్ పెండ్లి చీరను అందించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు చిలుకమారి శ్రీనివాస్, సభ్యులు, కొక్కుల సుదర్శన్, అనుమల్ల శ్రీనివాస్, ఆకుబత్తిని శ్రీనివాస్, మానపురి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.