30-03-2025 12:00:00 AM
ఎల్బీనగర్, మార్చి 29 : తెలంగాణ రాష్ట్రంలో చైల్ కేర్ కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థుల్లో అత్యుత్తమ ఫలి తాలు సాధించిన ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహానికి చెందిన ఇద్దరు విద్యార్థులకు బెంగళూరుకు చెందిన ‘గార్డియన్స్ ఆఫ్ డ్రీమ్స్’ సంస్థ ఒక్కొక్కరికి రూ. 50వేల విలువైన లాప్ టాప్‌లు అందజేశారు.
బెంగళూరుకు చెందిన గార్డియన్స్ ఆఫ్ డ్రీమ్స్ సంస్థ గత విద్యాసంవత్సరం (2023 ఎల్బీనగర్‌లోని అనాథ విద్యార్థి గృహానికి చెందిన విద్యార్థి శివ ఇంటర్మీడియట్‌లో 97 శాతం, పదిలో జి.కార్తిక్ - 9.5 జీపీఏ సాధించారు. వీరికి రెండు లాప్‌లను బహు మతిగా పంపించారని గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్ తెలిపారు. అనా థ విద్యార్థులను అందుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.