25-04-2025 11:31:09 PM
సత్తుపల్లి (విజయక్రాంతి): ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ నందు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ద్వారా ఐఐటి కాన్పూర్ లో సీటు పొందిన తేజావత్ శ్రీనివాస్ తల్లిదండ్రులకు స్ఫూర్తి ఫౌండేషన్ వారి ఆర్థిక సహాకారంతో ఫౌండేషన్ ప్రతినిధి వరకా రామారావు ఆధ్వర్యంలో రూ. 1,25,000/- కు గాను, తొలి విడతగా 50,000/- చెక్ ను అందజేశారు. కలెక్టర్ స్ఫూర్తి ఫౌండేషన్ వారు చేస్తున్న అనేక కార్యక్రమాలను అడిగి తెలుసుకొని ఫౌండేషన్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఎంవో రాజశేఖర్, ఫౌండేషన్ వాలంటీర్లు ఉబ్బన బాబురావు, జల్ది రామకృష్ణ, భైర్ల వెంకటేశ్వర్లు (బివి), శిరసాని ఇమ్మానియల్ పాల్గొన్నారు. ఇంతటి సహాయాన్ని అందించిన స్ఫూర్తి ఫౌండేషన్ ధాతలకు, స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ వ్యాల్ కి, విద్యార్థి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.