calender_icon.png 25 March, 2025 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్ని ప్రమాద బాధితురాలికి సహాయం

23-03-2025 03:18:59 PM

కాటారం,(విజయక్రాంతి): కాటారం మండలంలోని రేగులగూడెం (దేవరాం పల్లి) గ్రామం నేతకాని వాడకి చెందిన జిముడ దుర్గమ్మ ఇల్లు ఆదివారం తెల్లవారుజామున ప్రమాదమశాత్తు అగ్నికి ఆహుతి అయ్యింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయింది. ఇల్లు తో సహా ఇంట్లో వస్తువులు, నగదు, బంగారు ఆభరణాలు కాలిపోవడం తో సుమారు 8 లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఐ టీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు వారి వ్యక్తిగత సహాయకులు ప్రవీణ్ సందర్శించారు. బాధితురాలికి ముడి సరకులు అందజేసి ఆర్థిక సాయం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్, మండల రెవెన్యూ అధికారి , ట్రాన్స్ కో, ఫైర్, అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐయిలినేని నవీన్ రావ్, ఓన్న వంశవర్ధన్, గంధం బాలరాజు, గంధం భీమయ్య, నూకల సారయ్య, పాగే సురేష్, పాగే సమ్మయ్య, కుమ్మరి నగేష్, జాడి రామయ్య పాల్గొన్నారు.