మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ జిలాని...
కోదాడ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు భాగంగా యూనిట్ ఆఫీస్ కోదాడలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ జిలాని సోమవారం కార్యాలయంలో వాహనదారులుతో ప్రతిజ్ఞ చేయించినారు. భద్రత వారోత్సవాలు భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మద్యం సేవించి వాహనం నడుపు రాదని సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలని వాహనాలను అధిక స్పీడ్ తో ఓవర్ లోడ్ తో నడపరాదని కార్యాలయంలో వచ్చిన వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఆఫీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.