calender_icon.png 9 February, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎండల్లో హాయ్ హాయ్!

09-02-2025 12:27:58 AM

ఎండలు మొదలయ్యాయి.. ఉష్ణోగ్రత్తలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధిక వేడి, చెమట చిరాకు పెట్టేస్తున్నాయి. అయితే సమ్మర్‌లో సౌకర్యవంతంగా, స్టైలిష్‌గా ఉండే దుస్తులను ఎంచు కుంటే కొంత ఉపశమనం పొందొచ్చు. సమ్మర్‌లో ధరించే దుస్తులు ఫ్యాషన్‌గా, సౌకర్యవంతంగానూ ఉండాలి. అందుకే కాటన్ దుస్తులు లాంటివి బెస్ట్ ఛాయిస్. చల్లదనాన్ని కూడా ఇస్తాయి. శరీరానికి హత్తుకొనే జీన్స్, టైట్ ప్యాం ట్స్ కాకుండా తేలికగా ఉండేవాటిని ఎంచుకుంటే బెటర్.

కాటన్ చీరలు: వేసవిలో చాలా సౌకర్యవంతంగా శరీరానికి చల్లదనాన్ని కల్పించేవాటిలో కాటన్ చీరలు ఒకటి. ఈ చీరలతో సౌకర్యవంతంతోపాటు స్టుల్‌గానూ కనపడొచ్చు. 

సల్వార్ కమీజ్: లూజ్ ఫిట్టింగ్ సల్వార్ కమీజ్ అద్భుతమైన దుస్తులు. ఇవి కూడా చీరల్లాగానే, సమ్మర్‌లో ధరించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

 లాంగ్ స్కర్ట్: వేసవికాలంలో ఎండను తట్టుకోవాలంటే లాంగ్ స్కర్ట్స్ బెటర్. వీటిని ధరించడం వల్ల హాయిగా ఉంటుంది. అధిక వేడి అనిపించదు. లాంగ్ స్కర్ట్స్ మీదకు కాటన్ స్కర్ట్స్ ఎంపిక చేసుకుంటే చాలా బాగుంటుంది.