calender_icon.png 13 January, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్లో నేరేడల్లో పిల్లా..

11-01-2025 12:00:00 AM

బ్రహ్మాజీ ప్రధాన లీడ్ రోల్‌లో నటిస్తున్న డార్క్ కామెడీ- డ్రామా ‘బాపు’. ఈ చిత్రంలో ఆమని, బలగం సుధాకర్‌రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దయా దర్శకత్వంలో కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్లపై రాజు, సీహెచ్ భాను ప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్నారు.

నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఓ వ్యవసాయ కుటుంబ భావోద్వేగాల ప్రయాణంగా రూపొందిందీ చిత్రం. తాజాగా మేకర్స్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండతో ఈ చిత్రంలోని ‘అల్లో నేరేడల్లో పిల్లా’ అనే పాటను రిలీజ్ చేయించారు. రఘురాం పాట రాయగా, ధ్రువన్ సంగీత సారథ్యంలో రామ్ మిర్యాల పాడారు. ఈ సినిమాకు వాసు పెండెం డీవోపీగా పనిచేస్తున్నారు.