calender_icon.png 20 February, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10 గంటలు విలవిలలాడిన చిన్నారి

17-02-2025 08:43:51 PM

వేలుకు ఇరుక్కున్న రింగ్..

అతి కష్టం మీద తీసిన ఫైర్ సిబ్బంది..   

కార్వాన్ (విజయక్రాంతి): ఓ చిన్నారి 10 గంటల పాటు విలవిలలాడింది. వేలుకి రింగు ఇరుక్కుపోవడంతో నరకయాతన అనుభవించింది. ఈ సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. కార్వాన్ నియోజకవర్గంలోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన చిన్నారి దీపిక శనివారం ఆడుకుంటూ ఓ స్టీల్ రింగ్ ను తన వేలికి పెట్టుకుంది. అది ఇరుక్కుపోవడంతో బాలిక విలవిలలాడింది. రింగును చిన్నారి వేలు నుంచి తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దింతో బాలికను కుటుంబ సభ్యులు దగ్గరలోని హాస్పిటల్ తో పాటు గోల్డ్ స్మిత్ వద్దకు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది.

చివరికి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. రింగును తీయడం తమతో కాదని చెప్పిన వైద్య సిబ్బంది బాలికను గౌలిగూడ ఫైర్ స్టేషన్ తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి సిబ్బంది బాలిక వేలుకి ఉన్న రింగ్ కట్ చేసి అతికష్టం మీద తొలగించారు. చిన్నారి సుమారు 10 గంటల పాటు నరకయాతన అనుభవించింది. చివరకు రింగును తొలగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫైర్ సిబ్బందిని బాలిక కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అభినందించారు.