* ప్రమాదంలో నలుగురు మృతి
న్యూఢిల్లీ, డిసెంబర్ 22:తుర్కియే లో విషాదం జరిగింది. వైద్యులతో బయలుదేరిన ఓ అంబులెన్స్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆసుపత్రి భవనాన్ని ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు సహా మొ త్తం నలుగురు మృతిచెందారు. స్థానిక అంతల్యా ప్రావిన్స్‌లో ఉన్న ఓ రోగిని ఆసుపత్రికి తీసుకొచ్చేందుకు ముగ్లా ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్ బృం దం హెలికాప్టర్‌లో బయల్దేరింది. హెలికాప్టర్ టేకాఫ్ అవుతున్న క్రమం లో ఆసుపత్రి నాలగో అంతస్తును ఢీకొట్టి నేలకూలింది. దాంతో అందు లో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దట్టమైన పొగమంచు కారణంగానే ఈ ప్రమా దం జరిగినట్లు దర్యాప్తులో తేలింది.