calender_icon.png 30 September, 2024 | 5:00 PM

మూసీ ఆక్రమణలపై హెడ్రా ఫోకస్!

26-09-2024 04:06:27 AM

పరివాహక ప్రాంతాల్లోని నిర్వాసితుల తరలింపు షురూ

స్వయంగా పరిశీలిస్తున్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు

మూసీ వాటర్ బెడ్, బఫర్‌జోన్లలోని నిర్వాసితులకు 15 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ 

ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దానకిషోర్

శని, ఆదివారం ఇండ్లను కూల్చేందుకు సన్నాహకాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలపై హైడ్రా దృష్టి సారించింది. మూసీ ఒడ్డున ఉన్న ఇండ్లను కూల్చివేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా మూసీ నిర్వాసితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ మొదలైంది.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు స్వయంగా రంగంలోకి దిగి అర్హులైన నిర్వాసితులకు పరిహారం అందిస్తున్నారు.  నిర్వాసితుల గుర్తింపు కొరకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, పోలీసు అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించిన అధికారులు నిర్వాసితులకు సంబంధించిన కుటుంబ సభ్యుల వివరాలు,

నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలకు సంబంధించిన నిర్మాణాల వివరాలతో పాటు ఇండ్ల యజమాని/నిర్వాహకుల వివరాలను, ఇంటి/భూమి/పట్టాకు సంబంధించిన పత్రాలను, విద్యుత్ బిల్లు, ఆధార్/రేషన్ కార్డులలోని వివరాల ఆధారంగా సరిపోల్చి ప్రాంతాల వారిగా నివేదికలను రూపొందిస్తున్నారు. అలాగే కిరాయిదారులు, అర్హుల వయసు, కులం, దివ్యాంగులు వివరాలను ప్రత్యేకంగా సేకరిస్తున్నారు. 

ప్రత్యేక బృందాలు..

మూసీ నిర్వాసితులను పక్కాగా గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా హైదరాబాద్ జిల్లాలో 16 బృందాలను, రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ జిల్లాలో 5 బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందం 75 ఇండ్ల వివరాలను సేకరించేలా అధికారులు ఏర్పాటు చేశారు. ఇందు లో భాగంగా ఆర్డీవో స్థాయి అధికారులు, ఎమ్మార్వోలు రంగంలోకి దిగారు.

ప్రతి రెండు సర్వే బృందాలపై పర్యవేక్షణ అధికారిగా ఒక డిప్యూటీ కలెక్టర్‌ను ప్రభుత్వం నియమించింది. అయితే సర్వే అధికారులు ఎట్టి పరిస్థితులలోను నిర్వాసితులను ఇబ్బందులకు గురిచేయొద్దని, వారి పట్ల మాన వతా దృక్పథంతో ఉంటూనే ఇండ్లను ఖాళీ చేయించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సర్వే అధికారులకు సూచిస్తున్నారు.

నిర్వాసితులందరికీ ప్రభుత్వం డబుల్ బెడ్ రూంలతో పాటు పరిహారం అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగానే ఇండ్లను ఖాళీ చేస్తారని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా ల కలెక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

15 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు: దానకిషోర్  

మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే నిర్వహించిన సర్వేలో ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతం వెంట సుమా రు 15 వేల మంది నిర్వాసితులున్నట్లు గుర్తించామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ తెలిపారు.

మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారిలో ఎక్కువ మంది పేద ప్రజలే ఉన్నారని, వీరికి సుమారు 15,000 డబుల్ బెడ్ రూం ఇండ్ల ను కేటాయించాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసిందని దానకిషోర్ స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం మంగళవారం జారీచేసిన ఉత్తర్వులలో 16వేల ఇండ్లను కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

అయితే మూసీ రివర్ పరివాహక ప్రాంతాల్లో నిర్వాసితులు అవుతున్న వారి సంఖ్యను బట్టి డబుల్ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపు జరుగుతుందని ఆయన తెలిపారు. ఇందుకు సబం ధించిన ప్రాథమిక నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించామని ఆయన తెలిపారు. మూసీ నిర్వాసితులైన ప్రతి అర్హుడికి డబుల్ బెడ్ రూం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉంటాయని కలెక్టర్లు పేర్కొంటున్నారు.

ఈ అంశంపై మూసీ పరివాహక ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాల తొలగింపుపై హైదరాబా ద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలను నిర్వహించారు. తొలి విడతలో దాదాపు 1,600 ఇండ్ల తొలగింపునకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ముందుగా హైదరాబాద్ జిల్లా పరి ధిలోని గోల్నాక, చాదర్‌ఘాట్, మూసారంబాగ్ ప్రాంతాల్లో కూల్చివేతలుంటాయని అధికారులు సూచనాప్రాయంగా తెలిపారు. ఇప్పటికే తొలిరోజు 1,772 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు.

వీటిలో రం గారెడ్డి జిల్లాలోని గండిపేట్, రాజేంద్రనగర్ మండలాల్లోని మూసీ పరివాహక ప్రాంతా ల్లో 333 మంది నిర్వాసితులకు, హైదరాబాద్ జిల్లా పరిధిలో దాదాపు 1,200 మం ది, మేడ్చల్ పరిధిలో 239 మంది నిర్వాసితులకు నోటీసులు జారీ చేశారు.

హైడ్రాకు 169 మంది సిబ్బంది

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అం డ్ అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా) కు ప్రభుత్వం 33 శాఖలకు సంబంధించిన 169 మంది అధికారులకు, సిబ్బం దిని కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశా రు.

ఆల్ ఇండియా సర్వీసెస్ స్థాయి అధికారిని కమిషనర్‌గా, ఎస్పీ ర్యాంకు అడి షనల్ కమిషనర్ హోదాలో క్యాడర్ పోస్టులను కేటాయించిన ప్రభుత్వం అలాగే ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులను అడిషనల్ కమిషనర్‌గా, 5 మంది డీఎస్పీలను. 16 మంది సీఐలను, 16 మంది ఎస్సైలను, రిజర్వు ఇన్‌స్పెక్టరుౌ్ల 3, రిజర్వు సబ్ ఇన్‌స్పెక్టర్లు ఇన్‌స్పెక్టర్ (కమ్యునికేషన్స్) సబ్ ఇన్‌స్పెక్ట ర్(కమ్యునికేషన్స్) పోలీసు కానిస్టేబు ల్ (కమ్యునికేషన్) పోలీసు కానిస్టేబు ల్స్‌ఁ మంది, అనలైటికల్ ఆఫీసర్ డిప్యూటీ అనలైటికల్ ఆఫీసర్ అసిస్టెంట్ అనలైటికల్ ఆఫీసర్ రీజనల్ ఫైర్ ఆఫీసర్ అడిషనల్ ఫైర్ ఆఫీసర్  స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సిటీ ప్లాన ర్ డిప్యూటీ సిటీ ప్లానర్స్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (ఐఆర్‌ఆర్) డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ (పీహెచ్) అసిస్టెంట్ ఇంజినీర్స్ (పీహెచ్) డిప్యూ టీ సెక్రటరీ (ఫైనాన్స్) డిప్యూటీ కలెక్టర్) ఎమ్మార్వో/తహసీల్దార్ సర్వే యర్లు సబ్ రిజిస్ట్రార్స్ సూపరింటిండెంట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సైంటిస్ట్ (పీసీబీ) కేటాయించారు.