25-04-2025 04:43:25 PM
ఫైర్ షాట్స్ తో హెవీ సౌండ్స్...
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): పట్టణంలో బైక్ రాయుళ్లతో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఆకతాయిలు రాయల్ ఎన్ఫిల్డ్ సహా మరికొన్ని బైక్ కంపెనీలు బిగించిన సైలెన్సర్ లను తీసివేసి హెవీ సౌండ్స్ వచ్చే సైలెన్సర్లను బిగించి రోడ్లపై రెచ్చిపోతున్నారు. డుగుడుగు శబ్దాలతో చెవులకు చిల్లులు, గుండెకు దడ పెంచుతున్నాయని పుర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పోర్ట్స్, ఇతర బైకుల సైలెన్సర్ లను తీసి నడపడం, మరికొంత మంది రాయల్ ఇన్ఫీల్డ్ బండ్లతో రోడ్లపై గన్ఫైర్ షార్ట్ చేస్తు వీరంగం సృష్టిస్తున్నారు. దీంతో రోడ్లపై వెళ్తున్న పిల్లలు, మహిళలు, వృద్ధులు కంగారు పడుతున్నారు. పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి సౌండ్ మీటర్ ద్వారా డెసిబుల్స్ పరిమితికి మించి ఉన్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఆకతాయిలపై పోలీసుల నిఘా ఎప్పుడూ ఉంటుందని పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.