calender_icon.png 1 January, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిమాచల్‌లో భారీగా హిమపాతం

29-12-2024 01:34:20 AM

* చిక్కుకుపోయిన 5,000 మంది 

* రక్షించిన పోలీసులు

* ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ

సిమ్లా, డిసెంబర్ 28:  హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీగా హిమపాతం కురుస్తోంది. దీంతో కులులోని సోలాంగ్ నాలా అనే స్కీ రిసార్ట్‌లో 5,000 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వారిని పోలీసులు రక్షించారు. శుక్రవారం నుంచి రాష్ట్రంలో అధికంగా మంచు కురుస్తుండడంతో సోలాంగ్ నాలాలో సుమారు 1,000 వాహనాలు చిక్కుకుపోయాయి.

వాటిలో సుమారు 5,000 మంది టూరిస్ట్‌లు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన వారిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రంలో భారీ హిమపాతం, చలి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

లహౌల్ కాంగ్రా, కులు, సిమ్లా, కిన్నౌర్ సహా ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు మంచు కురుస్తోంది. బిలాస్‌పూర్, హమీర్‌పూర్, ఉనా జిల్లాల్లో చలిగాలులు ఆదివారం వరకు వీస్తాయని.మండి, కులు, చంబాతో పాటు పలు ప్రాంతాల్లో జనవరి 1 వరకు చలిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.అంతేకాక దట్టమైన పొంగమంచు ఏర్పడవచ్చని ప్రకటించింది. సిమ్లాలో  కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయే అవకాశః ఉందని పేర్కొన్నది.