* తీవ్రమైన హిమపాతంతో జనజీవనం అస్తవ్యస్తం
* 7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటన
* 60 మిలియన్ల మందిపై పెను ప్రభావం
* ‘పోలార్ వర్టెక్స్’ వల్లే దుర్లభ పరిస్థితులు బయటకు రాకండి..
తుఫాన్‌కు ముందు కెంటకీ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని విధించిన గవర్నర్ ఆండీ బెషీర్ మాట్లాడుతూ.. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావొద్దని, కుటుంబ సభ్యులతో క్షేమంగా ఉండమన్నారు.
వాషింగ్టన్, జనవరి 6: అమెరికాలోని పలు రాష్ట్రాలు భారీ మంచు తుఫాన్‌కు గజగజలాడిపోతున్నాయి. భారీగా మంచు కురుస్తుండడం తో రహదారులపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో దశాబ్దకాలంలో రికార్డు స్థాయిలో భారీగా హిమపాతం నమోదవ్వడం గమనార్హం.
దేశంలోని కాన్సాస్, వెస్ట్ర న్ నెబ్రాస్కా, ఇండియానా రాష్ట్రాల్లో భారీగా కురిసిన మంచుతో హైవేలు, ఇతర ప్రధాన మార్గాలు మూసివేశారు. రోడ్లపై ఇరుక్కుపోయిన వాహనదారులకు సాయం చేయడానికి భద్రతా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
8 అంగుళాలు(20 సెంటీమీటర్లు) మంచు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ విభా గం కాన్సాస్, మిస్సౌరీ రాష్ట్రాలకు భారీ శీతాకాలపు తుఫాన్ హెచ్చరికలను జారీ చేసింది. ఇక్కడ మంచు తుఫాన్ గాలులు గంటకు 72 కి.మీ. వేగంతో వీయడం ప్రమాద తీవ్రతను సూచిస్తోంది.
పోలార్ వర్టెక్స్ వల్లే..
అర్కిటిక్ చుట్టూ పోలార్ వర్టెక్స్(ధృవపు సుడిగుండం) కారణంగానే ప్రస్తుత విపరీత వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని నిపుణులు చెబుతున్నారు. యూఎస్, యూరప్, ఆసియాలోని ప్రజలు ఈ సుడిగుం డం తప్పించుకుని దక్షిణంగా విస్తరించినప్పుడు దాని తీవ్రమైన చలిని అనుభవిస్తారని వివరించారు.
జనజీవనం అస్తవ్యస్తం..
మంచు తుఫాన్ ప్రమాదకరంగా మారడంతో అమెరికాలోని 60 మిలియన్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 7 రాష్ట్రా లు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. భారీగా మంచు కురుస్తుండడంతో వాహన దా రులు ప్రయాణాన్ని విరమించుకోవాలని అధికారులు సూచించారు.
కాన్సాస్‌లోని కొన్ని ప్రాంతాలలో 10 అంగుళాలు, ఉత్తర మిస్సౌరీలోని కొన్ని ప్రాంతాలలో 14 అంగుళాలు, కెంటకీ, లూయిస్‌విల్లేలో ఆదివారం 7.7 అంగుళాల మేర మంచు కురిసింది. ఇక్కడ 1910లో 3 అంగుళాల హిమపాతం కురవడమే రికార్డు.