22-03-2025 12:17:14 AM
సీపీ సుధీర్‌బాబు
ఉప్పల్, మార్చి 21: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం మొదటి మ్యాచ్ జరగనుందని చెప్పారు. స్టేడియంలో 39,000 మంది సిట్టింగ్ సామర్థ్యం ఉందని, 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు.
2,700 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తుతో ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఎవరైనా బ్లాక్‌లో టికెట్లు విక్రయించడా నికి ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనాల పార్కింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. బస్సులు, మెట్రో రైళ్ల సమయాల్లో మార్పులు చేశామని, స్టేడియంలోకి లాప్ టాప్స్, బ్యానర్స్, వాటర్ బాటి ల్స్, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హెల్మెట్లు, బ్యాగ్స్, బయటి ఫుడ్ నిషేధమని చెప్పారు.