calender_icon.png 12 March, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద భారీ భద్రత

12-03-2025 12:00:55 PM

సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజ్, సెయింట్ ఆంథోని పాఠశాల పరీక్ష కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ  పరితోష్ పంకజ్ 

సంగారెడ్డి, (విజయక్రాంతి): ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరీక్ష కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశామని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలో ఈ నెల 6వ  నుండి 22వ తేది వరకు జరగనున్న ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు  వివరించారు. పరీక్ష కేంద్రాల వద్ద 125 బి.యన్.యస్.యస్, (144) సెక్షన్ అమలులో ఉంటుందని, సెంటర్ల వద్ద గుంపులు, గుంపులుగా తిరగడ్డానికి వీలులేదు అని, 100 మీటర్ల దూరం వరకు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎలాంటి జిరాక్స్ సెంటర్స్ ఓపెన్ చేయకూడదని అన్నారు. పరీక్ష కేంద్రాలలోనికి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాలలోనికి అనుమతించరాదని సిబ్బందికి సూచించారు.