పట్టించుకోని అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 27(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో ఇసుక అక్రమ రవాణా జో రుగా సాగుతోంది. ప్రధానంగా పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచతో పాటు కొత్తగూడెం సమీపంలోని చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మం డలాల్లో ఇసుక అక్రమ రవాణాకు అద్దు అ దుపు లేకుండా పోతోంది. ఆయా మండాల సమీపంలోని వాగుల్లో ఇసుకను రాత్రివేళలో ట్రాక్టర్లతో ఒక ప్రదేశంలో నిల్వచేసి ఆ తర్వాత లారీల్లో తరలిస్తూ అక్రమాల కు పాల్పడుతున్నారు. రాత్రి 11 గంటలు దాటి ందంటే చాలు నంబర్ ప్లేట్స్ లేకుండా ఇసు క ట్రాక్టర్లు దర్శనమిస్తున్నాయి. ఏకంగా పోలీ స్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం ముం దు నుంచే ఇసుక ట్రాక్టర్లు వెళుతున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
అడిగితే దౌర్జన్యమే..
పాల్వంచ పట్టణ పరిదిలోని కుంటినాగులగూడెం, గుర్రలగుంట , గుడిపాడు, రంగా పురం, పాత పాల్వంచ, ఎర్రగుంట గ్రామాల సమీపంలో ప్రవహిస్తున్న మొర్రెడువాగు ను ంచి అక్రమార్కులు ఇసుకను తోడేస్తున్నారు. ఎవరైనా ఆపి అడిగితే వారిపై దౌర్జన్యానికి ది గడం వారి నైజంగా మారింది. ప్రభుత్వం ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. కానీ చేయక పోవడంతో అక్రమార్కులు కాసుల వర్షం కురుస్తోంది. వాహనాల నిబంధనల ప్ర కారం ప్రతి వాహనానికి తప్పని సరిగా ఇ ంజన్‌కు, ట్రాలీకి నెంబర్‌ప్లేట్ల ఉండాలనే ని బంధన ఉంది. దాన్ని అతిక్రమించి రాత్రివేళ్లలో తిరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్య లు తీసుకోకపోవడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
ప్రభుత్వ పనుల పేరుతో..
ఇదిలా ఉంటే పాల్వంచ పట్టణంలో కొం దరు బడావ్యాపారులు ప్రభుత్వ పనులకు ఇ సు కను తరలిస్తున్నామంటూ ప్రైవేట్ వ్యా పారాలు జోరుగా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నూతనంగా నిర్మిస్తున్న భవనాలకు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. ప్రభుత్వ పనులకు ఇసుక అవ సరముంటే తగిన రుసుం చెల్లించి అనుమతి పత్రం జా రీ చేస్తారు. కానీ పాల్వంచలో తిరుగుతున్న ఇసుక ట్రాక్టర్ల వద్ద అలాంటి అనుపతి ప త్రాలు లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. ఇ ప్పటికైనా జిల్లా కలెక్టర్ కల్పించు కొని జిల్లా లో ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించి ప్రకృతి సంపదను కాపాడలని పలువురు కోరుతున్నారు.