చోద్యం చూసుకున్న మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు
మంథని (విజయక్రాంతి): మంథని పట్టణంలో జోరుగా ఇసుక అక్రమ దందా నడుస్తున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. మంథని మండలంలోని గోపాలపూర్, చిన్న ఓదాల మానేరు నది నుంచి రాత్రి పగలు అనే తేడా లేకుండా ట్రాక్టర్లలో ఇసుకను మంథని పట్టణానికి, ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. అయినప్పటికీ మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు మాత్రం నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఇసుక అక్రమ రవాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.