నేడు మరింత జాగ్రత్త
వాతావరణ కేంద్రం హెచ్చరిక
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో వానలు అధికంగా కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మిగతా జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు సైతం వీస్తాయని వివరించింది. బుధ, గురు వారాల్లోనూ పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.