calender_icon.png 21 September, 2024 | 12:57 PM

21, 22, 23 తేదీల్లో భారీ వర్షాలు

20-09-2024 02:19:22 AM

ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఈ నెల 21, 22, 23 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని గురువారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఆ మూడు రోజులకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసి ఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజాబామాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయంశంకర్ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పిం ది. ఎల్లుండి మాత్రం ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.