హైదరాబాద్: తిరుపతి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి తిరుపతి వీధులు జలమయమైయ్యాయి. తిరుపతి లక్ష్మీపురం కూడలి, గొల్లవానికుంట లోతట్టు ప్రాంతాల్లో వరద నీటి ప్రవాహం చేరింది. వెస్ట్ చర్చి కూడలిలో వర్షపు నీటితో రైల్వే అండర్ బ్రిడ్జి నిండిపోయింది. దీంతో వాహనాల రాకపోకలను అధికారులు దారిమళ్లించారు. బాలాజీ కాలనీ నుంచి మహిళా వర్శిటీ మీదుగా వాహనాలను మళ్లించారు. మాల్వాడిగుండం జలపాతం తిరుపతిలో పొంగిపొర్తుతుంది. కపిలతీర్థం పుష్కరిణికి వెళ్లకుండా భక్తులను టీటీడీ నిలిపివేసింది. తిరుమలలో ఎడతెరిపిలేని వర్షంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో టీటీడీ అప్రమత్తమైంది. పాపవినాశనం, శ్రీవారిపాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేసింది. గోబర్భం,పాపనినాశనం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి.